మిర్జాపూర్‌: ది మూవీ టీజర్

ఓటీటీ ప్రేక్షకులకు క్రైమ్‌ ప్రపంచాన్ని పరిచయం చేసిన వెబ్‌ సిరీస్‌ ‘మిర్జాపూర్.’ మీర్జాపూర్ తొలి దశ సీజన్‌ 2015లో విడుదల కాగ దానికి  విశేష ఆదరణ లభించడంతో 2020లో రెండో సీజన్‌, 2024లో మూడో సీజన్‌ తీసి విడుదల చేశారు. ఈ మూడు సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ వెబ్‌ సిరీస్‌ని మీర్జాపూర్: ది మూవీ పేరుతో సినిమాగా మలచి విడుదల చేయబోతున్నారు. 

నేడు విడుదలైన మిర్జాపూర్: ది మూవీ  టీజర్ కూడా ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. 

ఈ వెబ్‌ సిరీస్‌లో దేశ ప్రజలను బాగా ఆకట్టుకున్న పాత్రలు కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా భయ్యాలను మళ్ళీ వెండితెరపై చూపబోతున్నారు. 

ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఓటీటీలో ఇంత పాపులర్ అయిన ‘మిర్జాపూర్’ సినిమాగా పెద్ద హిట్ అవుతుందా? వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకొని అదే మ్యాజిక్‌ రిపీట్ చేస్తుందా లేదా? అనే విషయం సెప్టెంబర్‌ 4న విడుదలైతే తెలుస్తుంది.