నేడు శిల్ప కళావేదికలో పెద్ది మెగాబ్లాక్ బస్టర్ ఈవెంట్!

బుచ్చిబాబు సనా దర్శకత్వం రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేసిన ‘పెద్ది’ఫై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ రామ్‌ చరణ్‌ నటన, పాటలు, బీజీఎం అద్భుతంగా ఉండటంతో పెద్ది హిట్ అయ్యింది. ఇప్పటి వరకు పెద్ది రూ. కోట్లు 450 కోట్లు కలెక్షన్స్‌ సాధించినట్లు రామ్‌ చరణ్‌ చెప్పారు. పెద్ది హిట్ అయినందున మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో పెద్ది మెగాబ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నారని తెలియజేసింది. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు https://linktr.ee/PEDDITickets టికెట్స్ పొందవచ్చు. లేదా యూట్యూబ్‌లో https://t.co/Owntnm0ukw లింక్ ద్వారా ఈ కార్యక్రమం లైవ్ చూడవచ్చు.