ది ప్యారడైజ్‌… రిలీజ్‌ అప్పుడే కాదట!

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘ది ప్యారడైజ్’ మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వలన ఏకంగా ఆగస్ట్ 21కి వాయిదా పడింది. కానీ అప్పుడు కూడా విడుదల చేయలేని పరిస్థితి నెలకొని ఉండటంతో సెప్టెంబర్‌ 25కి మార్చినట్లు తాజా సమాచారం.

షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఆలస్యం వలన మరోసారి సినిమా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ సమయంలో సినిమా విడుదల చేసినట్లయితే సెలవులు కూడా కలిసి వస్తాయి కనుక ఓపెనింగ్స్ బాగా ఉంటాయని చిత్ర బృందం భావిస్తోంది. కనుక త్వరలోనే ప్యారడైజ్ కొత్త రిలీజ్‌ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.        

ఈ సినిమాలో నానికి జోడీగా కయాదు లోహార్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె సుబ్బు... సుబ్బలక్ష్మిగా నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తెలిపారు   

ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.               

ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. దసరా సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.