వెంకటేష్ తో క్రిష్ ప్రయోగం..!

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె ఇలా తన ప్రతి సినిమాను విలక్షణతో కూడుకుంటూ తన దర్శకత్వ ప్రతిభను చాటుకుంటున్న క్రిష్ ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ వందవ సినిమా గౌతిమిపుత్ర శాతకర్ణి సినిమాతో రాబోతున్నాడు. సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే ఈ క్రమంలో క్రిష్ తన తర్వాత సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడట. తెలుస్తున్న సమాచారం ప్రకారం క్రిష్ ఈసారి వెంకటేష్ తో ఓ సోషియో ఫ్యాంటసీ సినిమా చేయబోతున్నాడట.    

ఇప్పటికే చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న శాతకర్ణి సినిమా ఎంతో వైవిధ్యంగా రూపొందించబడుతుంది. ఇక దానికి ఏమాత్రం తీసిపోకుండా వెంకటేష్ సినిమా ఉండబోతుందట. జనవరిలో రిలీజ్ అవుతున్న శాతకర్ణి సినిమా రిజల్ట్ చూశాక వెంకటేష్ సినిమా ముహుర్తం పెట్టనున్నారట. కొద్దికాలంగా ఫ్యామిలీ సినిమాలను చేస్తూ కమర్షియలిటీకి దూరమైన వెంకటేష్ రీసెంట్ గా వచ్చిన బాబు బంగారంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. ఓ పక్క గురు సినిమా చేస్తున్న వెంకటేష్ మరో పక్క క్రిష్ సినిమాకు సన్నద్ధం అవుతున్నాడట. క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.