పెళ్లి అనగానే ఆఫర్లు కరువయ్యాయట..!

సౌత్ లో సూపర్ హీరోయిన్స్ లో అందం అభినయం రెండు కలగలిపిన హీరోయిన్స్ లో సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమా హీరో నాగ చైతన్యతోనే రియల్ లైఫ్ లో లవ్ లో పడింది. ఇక వారి పెళ్లి ముచ్చట్లు అందరికి తెలిసినవే. చాలా కష్టపడి హీరోయిన్ గా అగ్రస్థానంలో నిలిచిన సమంత పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోవట్లేదు. దీనికి నాగ చైతన్య మాత్రమే కాదు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే పెళ్లి న్యూస్ తెలియగానే సమంతకు ఆఫర్లు కరువయ్యాయట.   

ఇప్పటి వరకు తనను ఏ ఒక్క తెలుగు దర్శక నిర్మాతలు కలువలేదని ఈ మధ్యనే ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది సమంత. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తా అన్నా సరే ఎవరు తనని హీరోయిన్ గా పెట్టుకోవట్లేదని దీనికి కారణం పెళ్లి చేసుకోవడమే అంటుంది. ఇక ఆఫర్లు ఎలా ఉన్నా సరే తనకు మాత్రం ఓ మంచి ఫ్యామిలీతో స్థానం దొరికిందని అంటుంది. 

హీరోల వయసున్న కొడుకులున్నా వారు కూడా హీరోలుగా నటించే అవకాశం ఉంటుంది కాని ఓ పెళ్లైన హీరోయిన్ కు మాత్రం హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేందుకు వెనుకాడతారు. దీనికి కారణం ఒక్కటని ప్రత్యేకంగా చెప్పలేం కాని కెరియర్ మొదలు పెట్టిన నాటి నుండి అవకాశాలతో బిజీగా ఉన్న సమంత ఒక్కసారిగా ఇప్పుడు ఏ ఒక్క ఛాన్స్ రాకపోయే సరికి తన బాధను వ్యక్తపరిచింది. ఇక కేవలం సినిమాలే కాదు తను చేస్తున్న వాణిజ్య ప్రకటనలు కూడా ఒక్కొక్కటిగా చేజారుతున్నాయని అన్నది.