మిలియన్ మార్క్ పై చరణ్ కన్ను..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. అయితే తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు ఓవర్సీస్ కలక్షన్స్ మీద ఆధారపడి ఉండటంతో అక్కడ భారీ ప్రమోషన్స్ తో సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇక మరో రెండు రోజుల్లో రిలీజ్ అవనున్న చరణ్ ధ్రువ సినిమా ప్రత్యేకంగా ఓవర్సీస్ మార్కెట్ పై కన్నేశాడట. స్టార్ హీరోలందరు 1 మిలియన్ మార్క్ కలక్షన్స్ తో దూసుకుపోతుంటే మెగాస్టార్ వారసుడిగా చరణ్ అక్కడ మిలియన్ ఖాతా తెరవలేదు. అందుకే ఈ ధ్రువతో ఆ రికార్డ్ సాధించాలని ఫిక్స్ అయ్యాడు. 

ఓవర్సీస్ మార్కెట్ పై అవగాహన పెంచుకున్న చరణ్ ఏకంగా అక్కడ ఐదు రోజుల ప్రమోషన్స్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేనా 8న వేసే ప్రీమియర్స్ కు ఫ్యాన్స్ తో పాటు చెర్రి కూడా సినిమా చూస్తాడట. సినిమా రిలీజ్ అవుతున్న అన్ని చోట్ల తన అభిమానులకు కలిసేలా ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నాడట. దీనికోసం అక్కడ భారీగానే ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఓవర్సీస్ లో కలక్షన్స్ కోసం చరణ్ తన పంథాలో ప్రమోట్ చేస్తున్నాడు.

మరి ఇంత చేస్తున్నా చెర్రి అక్కడ క్లిక్ అవుతాడా లేడా అన్నది ఒక్క రోజు ఆగితే సరిపోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మార్కెట్ ఎలా ఉన్నా సరే ఓవర్సీస్ మార్కెట్ మీదే అందరి దృష్టి పడింది. అక్కడ నుండి మొదట పాజిటివ్ టాక్ వస్తేనే ఇక్కడ కూడా సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చరణ్ ధ్రువ ఏం చేస్తుందో చూడాలి.