మహేష్ పక్కా ప్లానింగ్..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా టైటిల్ పోస్టర్ జనవరి 1న గిఫ్ట్ గా రాబోతుందని ఫ్యాన్స్ ఉత్సాహంలో ఉన్నారు. ఇక అదే క్రమంలో టీజర్ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మురుగదాస్ సినిమాను ఎంత ప్లానింగ్ తో ఉన్నాడో అదే విధంగా చేయబోయే కొరటాల శివ మూవీకి అదే రేంజ్ ప్రీ ప్లానెడ్ గా ఆలోచిస్తున్నాడు మహేష్. ఫిబ్రవరి లో స్టార్ట్ అయ్యే కొరటాల శివ మహేష్ మూవీ అనుకున్న షెడ్యూల్ లో పూర్తి చేసి సెప్టెంబర్ 22న రిలీజ్ చేయాలని చూస్తున్నారట.    

ఈసారి పక్కా ప్లానింగ్ తో దిగుతున్న మహేష్ మరోసారి శ్రీమంతుడు రికార్డ్ రిపీట్ చేస్తాడని తెలుస్తుంది. చేస్తున్న మురుగదాస్ సినిమాను కూడా ఏప్రిల్ 14న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇది అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నా కొరటాల శివతో చేసే సినిమా మాత్రం పక్కాగా అనుకున్న డేట్ కు రిలీజ్ చేయాలని ముందే పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారట.

శ్రీమంతుడు కన్నా గొప్పగా ఉండే కథతో కొరటాల శివ మహేష్ కోసం ఈ కథను సిద్ధం చేశాడట. ప్రస్తుతానికి భరత్ అనే నేను టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్నడు లేనిది ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడని అంటున్నారు. మరి సిఎం మహేష్ గా సూపర్ స్టార్ క్రేజ్ ను పెంచేస్తున్న కొరటాల శివ సినిమాను ఏ రేంజ్ హిట్ అయ్యే విధంగా తీస్తాడో చూడాలి.