
మాస్ మహరాజ్ రవితేజ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుల మధ్య ఏమైందో ఏమో కాని ఆ ఇద్దరి సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. సినిమా ఎందుకు ఆగింది అన్న విషయం పట్ల ఏ ఒక్కరు సరైన క్లారిటీ ఇవ్వలేదు. రవితేజ దిల్ రాజుల మధ్య రెమ్యునరేషన్ గొడవలే అంటూ ఓ టాక్ అయితే ఉంది. ఇక ఆ సినిమానే కాదు సినిమా ఓకే అవడం అంతా ఓకే అనుకున్నాక అటకెక్కడం ఇదే రిపీట్ అవుతూ వస్తుంది సంవత్సరం పాటు రవితేజ కెరియర్ లో.. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆరా తీస్తే రవితేజ విహార యాత్రలకెళ్లాడు అందుకనే సినిమాలు ఓకే చేయలేదు అనేశారు.
ఫైనల్ గా ఇప్పుడు క్రేజీ కాంబో దిల్ రాజు రవితేజల సినిమా ఓకే అయ్యిందట. ఇక ఈ సినిమాను పటాస్, సుప్రీం సినిమాల డైరక్టర్ అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. తన మార్క్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్ సినిమాలను తీస్తూ హిట్స్ అందుకుంటున్న అనీల్ రావిపూడి నిన్నటిదాకా బాలయ్య, ఎన్.టి.ఆర్ లకు కథ వినిపించిన సంగతి తెలిసిందే. జూనియర్ కు కథ నచ్చినా సాహసం చేయలేక వద్దనేశాడు.
సో ఆ ఇద్దరు కాదనడంతో రవితేజ కోసం ఓ అదిరిపోయే కథ సిద్ధం చేసి వినిపించాడట. రవితేజ కూడా ఓకే చెప్పడంతో దిల్ రాజు ఈ సినిమా నిర్మించేందుకు ఫిక్స్ అయ్యాడు. ఇక రవితేజతో సినిమా తీసే ఆలోచనలో ఉన్న బాబి ఎన్.టి.ఆర్ సినిమా ఓకే చేసుకున్నాడు. సో మొత్తానికి దర్శకులు అటు ఇటు అయినా కాంబినేషన్ మాత్రం అంచనాలను పెంచేస్తున్నాయి మరి ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.