
మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని, అలనాటి అందాల నటి రవీనా టాండన్ కుమార్తె రాషా దడాని హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ‘మంగా మంగా..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. కాసర్ల శ్యాం వ్రాసిన ఈ పాటకి జీవీ.ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ఎల్.వి. రేవంత్ ఈ పాట పాడారు.
ఈ సినిమాలో ఇద్దరు సీనియర్ నటులు మోహన్ బాబు, నరేష్ నటిస్తున్నారు. నరేష్ ‘స్వతంత్ర బాబు’ అనే ప్రత్యేక పాత్ర చేస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం: జీవి.ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.