మెగా ఛాన్స్ పట్టేసినట్టేనా..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధ్రువ సినిమా డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి త్వరలో మెగాస్టార్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మెగాస్టార్ ప్రస్తుతం 150వ సినిమాతో బిజీగా ఉన్నారు అయితే దనై తర్వాత చేసే 151వ సినిమా ఆల్రెడీ బోయపాటి చేస్తారని తెలిసిందే. ఇక అదే క్రమంలో 152వ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే చిరుతో కథా చర్చల్లో కూడా జరిపారట. ఇక చెర్రి సినిమాకొస్తే తమిళ సూపర్ హిట్ సినిమాను తన దర్శకత్వ ప్రతిభతో మాత్రుక కన్నా గొప్పగా తీశాడని అంటున్నారు.

ఆ డైరక్షన్ టాలెంట్ నచ్చే సురేందర్ రెడ్డికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ధ్రువ తర్వాత సురేందర్ రెడ్డి కర్ణాటక మాజి ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ తో సినిమా చేస్తున్నాడు. తెలుగు కన్నడ భాషల్లో నిర్మించే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో వస్తుందట. ఇప్పటికే సురేందర్ రెడ్డి ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టాడట. ధ్రువ హిట్ అయ్యి చేసే నిఖిల్ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంటే మెగాస్టార్ ఛాన్స్ వచ్చేసినట్టే.