
రామోజి స్థాపించిన ఈటివికి తెలుగు బుల్లితెర మీద ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో తెలిసిందే. అలనాటి తెలుగు మధురమైన సినిమాలన్నిటిని సొంతం చేసుకున్న ఈటివి ఈమధ్య శాటిలైట్ రేసులో పూర్తిగా వెనుకపడి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడున్న ఛానెల్స్ తో సినిమా శాటిలైట్స్ విషయంలో పోటీ పడలేని ఈటివి శాటిలైట్స్ రూపంలో సినిమాలు కొనడం మానేసింది. అయితే సడెన్ గా ఏమైందో ఏమో కింగ్ నాగార్జున దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వస్తున్న ఓం నమో వేంకటేశాయ సినిమాను ఈటివి వారు ఏకంగా 4 కోట్లకు కొనేశారట.
ఇంత పెద్ద మొత్తం పెట్టి ఈటివి వారు ఓ సినిమా శాటిలైట్ రైట్స్ కొనడం ఇదే మొదటిసారి. ఓల్డ్ క్లాసిక్ మూవీస్ అన్ని తమ సొంతం చేసుకున్న ఈటివి ఇప్పుడు మళ్లీ శాటిలైట్స్ కొనేందుకు రంగం సిద్దం చేసుకుంది. నాగార్జున, రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య సినిమా రైట్స్ ఈటివి దగ్గర ఉండటంతో ఆ సినిమా టెలికాస్ట్ చేసిన ప్రతిసారి మంచి ప్రాఫిట్స్ చూస్తున్న ఈటివి ఈసారి అదే రేర్ కాంబోలో వస్తున్న ఓం నమో వెంకటేశాయ సినిమా రైట్స్ కూడా తీసుకున్నారట.
ఇక నుండి స్టార్ హీరోల సినిమాలను కూడా ఈటివి సొంతం చేసుకునే ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది. మరి అదే కనుక నిజమైతే సినిమాకు ముందే స్టార్ సినిమాకు ఛానెల్స్ అన్ని శాటిలైట్ ఫైట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.