మా ఇంటి బంగారం ఇప్పుడే కాదట!

నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌లో ‘మా ఇంటి బంగారం’ మే 15న విడుదల చేయాలనుకున్నారు. రామ్‌ చరణ్‌-జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న పెద్ది ఏప్రిల్‌ 30న విడుదలయ్యి ఉంటే మా ఇంటి బంగారంపై ఆ ప్రభావం పడేది. కానీ అదిప్పుడు జూన్‌కి వెళ్ళిపోయింది. కనుక మే 15న మా ఇంటి బంగారం విడుదల చేసుకుంటే పెద్దితో ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

 కానీ సరిగ్గా అదే సమయంలో ఐపీఎల్ కీలక మ్యాచులు ఉండటంతో ఆ ప్రభావం సినిమాపై పడవచ్చని భావిస్తూ జూన్‌కి వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. యష్‌ హీరోగా టాక్సిక్ జూన్‌లో 4న విడుదల కావాల్సి ఉండగా అది జూలైకి మారింది. 

కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జూన్‌ 4న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంటే బయట జరగబోయే ఐపీఎల్ కీలక మ్యాచుల కంటే పెద్దిలో జరిగే క్రికెట్ మ్యాచ్ ప్రభావం తక్కువగా ఉంటుందని సమంత, నందినీ రెడ్డి భావిస్తున్నట్లున్నారు.

ఈ సినిమాకు కధ: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, దర్శకత్వం: నందినీ రెడ్డి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాష్, డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: లీ విట్టకేర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.

ఈ సినిమాని సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి కలిసి ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.