యష్‌ టాక్సిక్‌ వాయిదా...

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్‌ హీరోగా ‘టాక్సిక్‌’ (సబ్ టైటిల్: ఏ ఫెయిరీ టేల్‌ ఫర్ గ్రోనప్స్) జూన్‌ 4న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. హీరో యష్‌ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈవిషయం తెలియజేస్తూ త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.  

 ‘టాక్సిక్‌’లో నయనతార, కియరా అద్వానీ, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌ ఐదుగురు హీరోయిన్లు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: గీతు మోహన్ దాస్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: రాజీవ్ రవి, స్టంట్స్: జేజే పెర్రీ (హాలీవుడ్‌), ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణతో కలిసి యష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి నిర్మించి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.