మహేష్ తో మూడోసారి..!

సూపర్ స్టార్ మహేష్ తో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తే అదో అదృష్టంగా భావించే హీరోయిన్స్ ఉండగా ఏకంగా మహేష్ తో ముచ్చటగా మూడోసారి లక్కీ ఛాన్స్ కొట్టేసింది కాజల్. బిజినెస్ మేన్, బ్రహ్మోత్సవం తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అవుతుంది. పివిపి బ్యానర్లో వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసే ఈ సినిమా 2017 సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. చేసే ప్రతి సినిమాలో తన మార్క్ డైరక్షన్ టాలెంట్ చూపిస్తు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న వంశీ పైడిపల్లి ఈ ఇయర్ ఇప్పటికే ఊపిరి రీమేక్ తో వారెవా అనిపించాడు.

ఇక మధ్యలో అఖిల్ సెకండ్ సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయినా మహేష్ తో సినిమా ఛాన్స్ కొట్టేశాడు. పర్సనల్ గా మహేష్ అంటే ఇష్టపడే వంశీ ఎలా డైరెక్ట్ చేస్తాడో చూడాలి. ఇప్పటికే స్టార్ హీరోలలో తారక్, రాం చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ లను డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి మొదటిసారి మహేష్ ను డైరెక్ట్ చేయనున్నారు. ఇక కాజల్ తో మహేష్ రొమాన్స్ అందరిని మెప్పిస్తుంది కనుకనే ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు.

దాదాపు కెరియర్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్లీ వరుస స్టార్స్ అవకాశాలను దక్కించుకుంటున్న కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఖైది నెంబర్ 150 సినిమాలో నటిస్తుంది. ఇక ఇదే కాకుండా రెండు మూడు స్టార్స్ సినిమాలో అవకాశాలు వచ్చినట్టు టాక్. వాటి సరసన మహేష్ సినిమా చేరి అమ్మడి క్రేజ్ ను మరింత పెంచేస్తుంది.