ముహుర్తం పెట్టడమే లేటట..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా ఏది అన్న దాని మీద క్లియర్ న్యూస్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో రూమర్స్ వస్తున్నా ఎవరెవరో డైరక్టర్స్ తారక్ తో సినిమా చేస్తారని చెబుతున్నా ఏది నిజం కాదని తెలుస్తుంది. అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మాట ఏంటంటే జూనియర్ తన తర్వాత సినిమా కన్ఫాం చేశాడట. అందరు అనుకుంటున్నట్టే బాబితోనే తన తర్వాత సినిమా ఫిక్స్ చేశాడట తారక్.

రీసెంట్ గా కథ విన్న జూనియర్ కథ నచ్చడంతో అతనికి ఓకే చెప్పాడని టాక్. అంతేకాదు ఈ నెల 9న అనగా ఈ శుక్రవారం సినిమాకు ముహుర్తం కూడా పెట్టేస్తున్నారట. తారక్ తీసుకున్న ఫ్యాన్స్ ను ఉత్సాహంలో ముంచెత్తుతుంది. తమ అభిమాన నటుడి సినిమా ముహుర్తం జరుగుతున్నదన్న వార్త అభిమానుల్లో ఓ ఎనర్జీని తెచ్చింది. పవర్ సినిమాతో డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన బాబి ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసినా అది ఫ్లాప్ అవడంతో కాస్త నిరాశ పడ్డాడు. నిన్న మొన్నటిదాకా మాస్ మహరాజ్ రవితేజతోనే మరో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చినా ఫైనల్ గా జూనియర్ సినిమాను డైర్కెట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ స్టేట్మెంట్ నేడో రేపో బయటకు వస్తుంది.