నితిన్ తో పవన్ త్రివిక్రం అబద్ధం..!

ఏంటి నితిన్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ అబద్ధం ఆడటం ఏంటని డౌట్ పడొచ్చు. ఇటీవలె త్రివిక్రం, పవన్ కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో నితిన్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా లై అని పెట్టబోతున్నారట. లై అంటే అబద్ధం అని మీనింగ్ కాని ఇక్కడ ఎల్.ఐ.ఈ అంటే మాత్రం లవ్ ఈజ్ ఎండ్లెస్ అని అంటున్నారు. 

త్రివిక్రం ను కన్విన్స్ చేసే కథ అంటే ఏమో అనుకున్నారు అయితే అది ఎండ్లెస్ లవ్ పవర్ అని టైటిల్ ఎనౌన్స్ చేశాక అర్ధమయ్యింది. అక్కడే దర్శకుడి ప్రతిభకు త్రివిక్రంతో పాటు పవన్ కళ్యాణ్ పడిపోయాడనుకుంట అఆతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ మరోసారి తన ఖాతాలో హిట్ వేసుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం హను రాఘవపుడితో ఓ సినిమా చేస్తుండగా ఈ లై సినిమా కూడా నితిన్ కు ఎంతో స్పెషల్ క్రేజ్ ను తెచ్చి పెట్టింది.

ఇక కెరియర్ లో 50 కోట్ల హీరోగా ఓ రేంజ్ ఫాం కొనసాగిస్తున్న నితిన్ రాబోతున్న సినిమాల విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. హను, కృష్ణ చైతన్య లాంటి టాలెంటెడ్ డైరక్టర్స్ తో సినిమాలు కమిట్ అవడం కూడా కెరియర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లో భాగమే అంటున్నారు. మరి ఈ సినిమాలు నితిన్ కు ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.