శ్రీనివాస మంగాపురం టీజర్‌

సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్‌ నేడు విడుదలైంది. అలనాటి అందాల నటి రవీనా టాండన్ కుమార్తె రాషా దడాని హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.

టీజర్‌ చూస్తే హీరో, హీరోయిన్‌ కొత్తవారైనప్పటికీ బాగానే నటించారనిపిస్తోంది. ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తే ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. 

శ్రీనివాస మంగాపురంలో సీనియర్ నటుడు నరేష్ ‘స్వతంత్ర బాబు’ అనే ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. ఇది నరేష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని దర్శకుడు అజయ్ భూపతి చెప్పారు. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. 

ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీవి.ప్రకాష్ కుమార్‌, కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.    

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/nom1-VpVMGY?si=sOVVBb_dn_uiMuDr" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>