కొరియన్ కనకరాజు నుంచి తొలి పాట కంసహమిడ ప్రమో!

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా చేస్తున్న ‘కొరియన్ కనకరాజు’ నుంచి ‘కంసహమిడ’ అంటూ సాగే తొలి పాట ప్రమో నేడు విడుదలైంది. పూర్తిపాట రేపు సాయంత్రం 4.05 గంటలకు విడుదల కాబోతోంది.

కాసర్ల శ్యాం వ్రాసిన ఈ పాటని తమన్ స్వరపరిచి సంగీతం అందించగా సిద్ శ్రీరాం పాడారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ మనోజ్ రెడ్డి చేస్తున్నారు.     

దక్షిణ కొరియా నేపధ్యంలో హర్రర్-కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్న ఈ  సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్నారు.