
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగదాస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా ఓకే చేసిన మహేష్ రెగ్యులర్ షూటింగ్ ను ఫిబ్రవరి నుండి పెట్టుకున్నాడు. ఇప్పటికే ముహుర్త కార్యక్రమాలను పెట్టుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉంది. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమా టైటిల్ భరత్ అనే నేను అని పెట్టబోతున్నారని టాక్ ఉంది. ఆ టైటిల్ కాదని చిత్రయూనిట్ కండించి కూడా చెప్పలేదు.
ఇక ఇప్పుడు ఆ సినిమా నిర్మాత డివివి దానయ్య అదే టైటిల్ ను ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించాడట. ముందు టైటిల్ పై కాస్త డౌట్ వచ్చినా ప్రేక్షకులు ఆ టైటిల్ పై పాజిటివ్ గా స్పందించడంతో దాన్నే ఫైనల్ చేశారు. చేస్తున్న మురుగదాస్ సినిమా టైటిల్ ఫైనల్ కాలేదు కాని ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే సినిమా విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. సో మహేష్ ఫ్యాస్ కు ఓ కన్ ఫ్యూజన్ తగ్గింది. ఇక ఎటుకూడి మురుగదాస్ సినిమా టైటిల్ పైనే ఇంకా ఓ క్లారిటీ రాలేదు.
ఫైనల్ గా ఎజెంట్ శివ అని చెప్పినా అఫిషియల్ గా మాత్రం బయట పెట్టలేదు. న్యూ ఇయర్ కు అయినా సరే మహేష్ తన సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.