
నందమూరి హరికృష్ణ హీరోగా సినిమాలు చేయడం మానేశారు. కెరియర్ మొదట్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన హరికృష్ణ వైవిఎస్ చౌదరి డైరక్షన్లో హీరోగా సినిమాలు చేసి హిట్ అందుకున్నారు. తర్వాత ఎందుకో ఆయన హీరోగా కంటిన్యూ చేయలేకపోయారు మధ్యలో అనారోగ్య సమస్య కూడా ఆయన నటించేందుకు సహకరించలేదు. అయితే మరోసారి హరికృష్ణ సిల్వర్ స్క్రీన్ మీద మెరవబోతున్నారట. ఈ సినిమాలో కేవలం హరికృష్ణ మాత్రమే కాదు కళ్యాణ్ రాం కూడా ఉంటాడట ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే సినిమాలో ఎన్.టి.ఆర్ కూడా కనిపించే అవకాశాలున్నాయట.
సో తారక్, కళ్యాణ్ రాం ఇద్దరు కల్సి మళ్లీ తండ్రి హరికృష్ణ ను హీరోగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారట కూడా కాస్త గ్యాప్ ఎక్కువ రావడంతో హరికృష్ణ కూడా కథ క్యారక్టరైజేషన్ మీద కాన్సెంట్రేట్ చేస్తున్నారట. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మరికొన్ని డీటేల్స్ త్వరలో వెళ్లడవుతాయి.