మెగా హీరో కథతో శర్వానంద్..!

కామెడీ ఎంటర్టైన్మెంట్స్ సినిమాలను తీస్తూ ప్రత్యేకమైన గుర్తింపు రాకున్నా పర్వాలేదు అనిపించుకున్న దర్శకుడు వీరభద్రం. అహనా పెళ్లంట, పూలరంగడు, రీసెంట్ గా వచ్చిన చుట్టాలబ్బాయ్ లతో సూపర్ హిట్లు కొట్టకపోయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అవుతున్నాడు ఈ డైరక్టర్. అయితే తన తర్వాత సినిమాను మెగా హీరో సాయి ధరం తేజ్ తో చేయాలని ప్రయత్నించాడు కాకపోతే తేజు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో అదే కథతో శర్వానంద్ తో తీసేందుకు సిద్ధమయ్యాడట. 

ఇప్పటికే శర్వానంద్ తో కథా చర్చల్లో పాల్గొనడం శర్వానంద్ కూడా ఓకే చేయడం అంతా జరిగిందట. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కు రెడీ చేసిన శర్వానంద్ తో అంటే ఆలోచనలో పడ్డారు ప్రేక్షకులు. ఎనర్జీ విషయంలో ఎవరికి వారే అనేలా ఉన్నా తేజు ఇంకాస్త పీక్స్ లో ఉంటాడు. మరి శర్వా ఏ మేరకు దాన్ని రీచ్ అవుతాడో చూడాలి. ఇక ప్రస్తుతం శతమానం భవతి, చంద్రమోహన్ డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్ వీరభద్రం సినిమాకు కాస్త టైం కావాలని అడిగాడట. అంతా సెట్ అయితే ఓకే కాని ఒకవేళ శర్వానంద్ కూడా హ్యాండ్ ఇస్తే వీరభద్రం మరో హీరోని వెత్తుక్కోవాల్సిందే.