విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్‌... గుడ్

వెంకీ అట్లూరి దర్శకత్వం ప్రముఖ కోలీవుడ్‌ నటుడు సూర్య, మమితా బైజు జంటగా చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్‌ విడుదలైంది.

తనకంటే వయసులో 20 ఏళ్ళు పెద్దవాడైన హీరోని వెంటపడి ప్రేమింఛి పెళ్ళి చేసుకోవాలనే అందమైన హీరోయిన్‌ అందమైన లవ్ స్టోరీ ఇది. కనుక ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర చాలా కీలకం. కానీ ఇలాంటి విలక్షణమైన కధలు, పాత్రలు చేయడంలో సూర్యకి సాటి లేరు. టీజర్‌లో అదే చూపారు.

టీజర్‌ చాలా సింపుల్‌గా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. కనుక సినిమా తప్పకుండా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. 

ఈ సినిమాలో రవీనా టండన్, రాధిక ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: వెంకీ అట్లూరి, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్‌, కెమెరా: నిమిష రవి, ఎడిటింగ్: నవీన్ నూలి, కోరియోగ్రఫీ: శేఖర్ విజే, విజయ్‌ బిన్నీ, స్టంట్స్: వి వెంకట్ చేశారు. తీయబోతున్నారు. 

శ్రీకర్ స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూలై నెలలో విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.