
మెగాస్టార్ తనయుడిగా రాం చరణ్ ఎంత క్రేజ్ సంపాదించాడో తెలిసిందే. ఇక ప్రస్తుతం ధ్రువ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకున్న చెర్రి ఆ వేడుకలో తనలోని కాన్ఫిడెన్స్ తో అందరిని ఆశ్చర్యపరచాడు. తన సినిమా గురించి గొప్పలు చెప్పుకోవడం అందరు చేసే పని కాని చరణ్ మాత్రం కష్టపడ్డాం ఫలితం మీ చేతిలోనే ఉంది అంటున్నారు.
ఇక ఫ్యాన్స్ ను ఉద్దేశించి పైన ఉన్న దేవుడు కనిపించడు కాని క్రింద దేవుళ్లు మాత్రం మీరే.. ఇక కె.టి.ఆర్ గురించి మాట్లాడుతూ రామ్ వచ్చినందుకు చాలా హ్యాపీ అన్నారు. అందరు సినిమాలు కష్టపడి చేస్తాం కాని రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఈ సినిమా కోసం తాను బాగా కష్టపడ్డది ఏం లేదు అసలు ఇలా కష్టపడకపోతే అర్ధమే ఉండదు అన్నాడు రాం చరణ్. ఇక అభిమానుల గురించి సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుతూ ఏ పరిశ్రమలో అయినా ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది.. డబ్బు పెడితే డబ్బు వస్తుంది.. కాని సినిమాల్లోనే ఎంటర్టైన్ చేస్తే బదులుగా డబ్బు, పేరు, రెస్పెక్ట్ అన్ని ఇచ్చేస్తారు అందుకే అభిమానులకు హీరోలం ౠణపడి ఉంటామని అన్నాడు.
ఇక ఇన్నాళ్లు నాన్న లేకుండా సినిమాలు చేశాం ఇప్పుడు రేసులో ఆయన కూడా దిగారు. ఇక నుండి కాస్త జాగ్రత్తగా సినిమాలు చేయాలి లేకుండా ఆయన కర్రెతో వస్తారు. ఇక స్టాండర్డ్స్ కూడా అదే రేంజ్లో ఉండేలా కష్టపడాలని అన్నారు. సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి అసలు ఈ రీమేక్ ఇష్టం లేదని కాని తన మాట కాదనలేక ఈ సినిమా చేశాడని అన్నారు. సినిమాలో నటించినందుకు అరవింద్ స్వామి గారికి థాంక్స్. ఇక రకుల్ అందాలు పరేషానురా సాంగ్ చూస్తే మీకు అర్ధమవుతుంది. ఆ పాటలో తనదో గెస్ట్ రోల్ మాత్రమే అని అన్నారు చరణ్. డిసెంబర్ 9న సినిమా వస్తుంది అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని తన ప్రసగం ముగించారు రాం చరణ్.