డేవిడ్ రెడ్డికి ఉక్రెయిన్ భామ మరియా హీరోయిన్

Manchu Manoj’s next movie title is David Reddy and Ukraine actress Maria Ryaboshapka is heroine. 

డేవిడ్ రెడ్డికి ఉక్రెయిన్ భామ మరియా హీరోయిన్ 

మంచు మనోజ్ చాలా ఏళ్ళ తర్వాత గత ఏడాది భైరవం, మిరాయ్ సినిమాలతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొంచెం విరామం తర్వాత ఇప్పుడు వై.హనుమ రెడ్డి దర్శకత్వం ‘డేవిడ్ రెడ్డి’ అనే కొత్త సినిమా ప్రారంభించారు. ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

ఆమె ఇదివరకే స్పెషల్ ఓపిఎస్ 1.5 అనే వెబ్‌ సిరీస్‌తో భారతీయ సినీ పరిశ్రమలో ప్రవేశించారు. ఆ తర్వాత అనుదీప్ కెవి దర్శకత్వం శివకార్తికేయాన్‌కు జోడీగా ‘ప్రిన్స్’ సినిమాలో నటించారు. ఇప్పుడు ‘డేవిడ్ రెడ్డి’తో కలిసి విదేశీ యువతి ‘క్లారా విట్మోర్‌’గా నటించబోతున్నట్లు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. ‘ఆమె ప్రేమ ఓ యుద్ధం’ అంటూ ఆమె పాత్ర గురించి చూచాయగా చెప్పేశారు. 

 “డేవిడ్ రెడ్డి ఇంటెన్స్ వరల్డ్ లీడింగ్ లేడీ మరియాకు స్వాగతం” అంటూ మంచు మనోజ్ ఆమెను తన సినిమాలోకి స్వాగతం పలుకుతూ ట్వీట్‌ చేశారు. 

కేజీఎఫ్ వంటి సూపర్ హిట్‌ సినిమాకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి, కోరియోగ్రఫీ: సుప్రీం సుందర్ చేస్తున్నారు. 

వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై మోటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.