
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాకే క్రేజ్ వస్తే ఇక ఆ హీరోయిన్ కు ఎదురు ఉండదు. అయితే ఆ క్రేజ్ తో వచ్చిన ఇమేజ్ ను తలకు ఎక్కించుకుంటే కనుక ఎంత త్వరగా ఇమేజ్ పెరిగిందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ప్రస్తుతం తెలుగులో వరుస స్టార్స్ తో ఛాన్సులు కొట్టేస్తున్న కీర్తి సురేష్ తనకు వస్తున్న ఆఫర్లను చూసి తానో స్టార్ హీరోయిన్ లా బిల్డప్ ఇస్తుందట. అందుకే తను చేస్తున్న ప్రస్తుత సినిమా నేను లోకల్ కు డేట్స్ విషయంలో తెగ ఇబ్బంది పెడుతుందట. నాని హీరోగా చేస్తున్న నేను లోకల్ సినిమా దిల్ రాజు నిర్మిస్తుండగా నక్కిన త్రినాధరావు డైరెక్ట్ చేస్తున్నాడు.
నేను శైలజతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత తమిళంలో సూపర్ స్టార్స్ తో నటించింది. ఇక తెలుగులో కూడా పవన్, మహేష్ సినిమాల అవకాశాలు రావడంతో ఇక తనకు తిరుగులేదని అనుకుంటుందో ఏమో చేస్తున్న సినిమా పట్ల కాస్త షో చేస్తుందని అంటున్నారు. ఈమె కారణంగానే సినిమా అనుకున్న టైం కు రిలీజ్ చేయడం కుదరట్లేదని అంటున్నారు. అదేమన్నా చిన్న సినిమా, తెలియని నిర్మాణ సంస్థ అయితే అనుకోవచ్చు.. చేసేది దిల్ రాజు సినిమా కాబట్టి అమ్మడికి ఈ ఎఫెక్ట్ రాబోయే సినిమాల మీద తప్పక పడే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయం గమనించి నడుచుకుంటే మంచింది లేదంటే ఆమెకు దర్శక నిర్మాతలు చెక్ పెట్టే ప్రయత్నం మొదలెట్టేస్తారు.