మెగాస్టార్ కు మాత్రమే ఆహ్వానం..!

అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది.. అక్కినేని వారసుడు అఖిల్ శ్రీయా భూపాల్ ల ఎంగేజ్ మెంట్ అత్యంత వైభవంగా జరుగనుంది. అయితే ఈ ఈవెంట్ కు కేవలం నాగార్జునకు చాలా దగ్గర వాళ్లు మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు కుటుంబాల సభ్యులతో పాటుగా చాలా తక్కువ మందిని అఖిల్, శ్రీయల ఎంగేజ్మెంట్ కు ఇన్వైట్ చేస్తున్నారట. పెళ్లి ఎలాగు ఇక్కడ కాదు ఇక ఇది కూడా గెస్ట్ లు లేకుండానే కానిచ్చేస్తారు. కాని రిసెప్షన్ కు మాత్రం టాలీవుడ్ అంతటికి స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తారట.    

సిని పరిశ్రమలో కూడా నాగార్జున కేవలం మెగాస్టార్ ఒక్కడికే ఎంగేజ్మెంట్ కు ఇన్వైట్ చేస్తున్నాడట. మిగతా మెగా హీరోలకు కూడా ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. సో పక్కా ప్లానింగ్ తో స్పెషల్ గా అతి తక్కువ మందితో ఈ ఎంగేజ్మెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తనలోని గ్రేస్ తో అందరిని ఆకట్టుకున్నాడు. అయితే తన రెండో సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ పెళ్లి విషయంలో మాత్రం త్వరగానే నిర్ణయం తీసుకున్నాడు.

మరి మెగాస్టార్ మాత్రమే నాగార్జున సన్నిహితుడా మిగతా వారు కాదా అంటే.. ఎవరి ప్రాముఖ్యతలు వారికి ఉంటాయి కాబట్టి నాగ్ ఇన్విటేషన్ ను తప్పుపట్టే అవకాశం లేదు. సో మొత్తానికి అఖిల్ ఎంగేజ్మెంట్ హంగామాలో సిని కలర్ తక్కువగానే ఉంటుంది అన్నది బయటకు వస్తున్న న్యూస్. అది నిజమా కాదా అన్నది తెలియాలంటే డిసెంబర్ 9దాకా వేచి చూడాల్సిందే.