
సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న రోబో సీక్వల్ 2.0 షూటింగ్లో రజినికాంత్ గాయాలపాలవడం జరిగింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం వర్షం కారణంగా మెట్ల మీద నడుస్తున్న సమయంలో రజిని జారి కింద్ర పడటంతో కుడి కాలికి గాయమయ్యిందని అంటున్నారు. ఇప్పటికే కబాలి టైంలోనే అనారోగ్య సమస్యతో బాధపడిన రజిని ఆ తర్వాత 2.0 షూటింగ్ మొదలు పెట్టాక కూడా కొంత విరామం తీసుకున్నారు.
ఇప్పుడు మళ్లీ షూటింగ్ లో ఇలా జరుగడంతో ఫ్యాన్స్ కంగారులో ఉన్నారు. అయితే అక్కడి నుండి వెంటనే హాస్పిటల్ కు వెళ్లడం అక్కడ చెకప్ చేసుకుని పర్వాలేదు అనుకున్నాక వెంటనే అటునుంచి అటే ఇంటికి వెళ్లడం జరిగిందట. శంకర్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమా మొన్నటిదాకా 350 కోట్ల బడ్జెట్ తోనే అన్నారు కాని ఇప్పుడు మరో 50 కోట్లు కూడా అవసరమయ్యేలా ఉందని తెలుస్తుంది. ఇక రజిని కోసం ఉక్రెయిన్ కు సంబందించిన సెట్ కూడా ఇక్కడే వేస్తున్నారట.
భారత దేశ సిని చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని అంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాలను అంచనాలను పెంచేసింది. వచ్చే ఏడాది రిలీజ్ అవుతున్న 2.0 సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.