
జబర్దస్త్ ప్రోగ్రాం తో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించిన షకలక శంకర్ ఆ ప్రోగ్రాం నుండి సినిమాలకు ప్రమోట్ అయ్యాడు. మొదట చిన్న సినిమాలతో స్టార్ట్ అయిన షకలక శంకర్ ఇప్పుడు సినిమాలో హీరోల పక్కన లీడ్ రోల్ చేసే స్థాయికి వచ్చాడు. ఈ ప్రయత్నంలో ఈమధ్య కాస్త జోరు పెంచుకున్న షకలక శంకర్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ స్టేటస్ ఇచ్చాడని తెలుస్తుంది. అదేంటి స్పెషల్ స్టేటస్ ఏంటి ఇదేమన్నా పొలిటికల్ ఇష్యూనా అంటే అదే కాదు కాని త్వరలో రిలీజ్ అవనున్న నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్ లో షకలక శంకర్ ఓ సర్ ప్రైజ్ క్యారక్టర్ లో కనిపించనున్నాడు.
ఇక ట్రైలర్ లో పవన్ ను ఆరాధించే శంకర్ స్పెషల్ స్టేటస్, ప్యాకేజ్ నాకిచ్చావా స్వామి అన్నాడు. ఇదో రకంగా శంకర్ ఈసారి కూడా పవర్ స్టార్ నూ వాడేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే తన బ్యాచ్ మెట్స్ ఇంకా జబర్దస్త్ లోనే కొనసాగుతున్నా తను మాత్రం సినిమాల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు షకలక శంకర్. మరి పవన్ ఇచ్చిన ఈ స్పెషల్ స్టేటస్ తో శంకర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక రిలీజ్ అయిన నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్ సినిమా ట్రైలర్ అందరిని ఇంప్రెస్ చేస్తుంది. దిల్ రాజు సమర్పణలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తుండగా అశ్విన్, నియోల్, పార్వతీశం నటించిన ఈ సినిమా యూత్ ను టార్గెట్ చేసుకుని వస్తుంది.