
సంచలన దర్శకుడు వర్మ తీసిన వంగవీటి సినిమా మీద ఇప్పటికే చాలా గొడవలు జరిగాయి. సినిమా మొదలైన రోజు నుండి వంగవీటి రాధాకృష్ణ వర్మ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. అయినా సరే వర్మ సినిమా మొత్తం తీసేసి ఈరోజు ఆడియో కూడా అదే విజయవాడలో పెట్టాలని నిర్ణయించాడు. అయితే కొద్దిసేపటి క్రితం వర్మతో వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిలతో చర్చలు జరిపినా లాభం లేకుండా పోయింది.
ఇప్పటికే వంగవీటి సినిమాలో తానే స్వయంగా పాడిన కమ్మ కాపు సాంగ్ వివాదం పెరగడంతో ఆ పాటను తీసేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే సినిమాలో కొన్ని సీన్స్ తమకు వ్యతిరేకంగా ఉన్నాయని వాటిని కూడా తొలగించాలని కోరగా వర్మ దానికి ఒప్పుకోలేదట. చర్చల అనంతరం వర్మ మీడియాతో మాట్లాడలేదు కాని తన ట్విట్టర్ లో మాత్రం క్లారిటీ ఇచ్చాడు.
నేను ఇప్పటిదాకా చాలా సీరియస్ వార్నింగ్ లు చూశాను కాని ఈరోజు నవ్వుతూ.. భయంకరంగా వార్నింగ్ ఇవ్వడం చూశాను. ఆశించినంత విధంగా మీటింగ్ జరుగలేదు అన్న వర్మ సినిమా విషయంలో తాను కాంప్రమైజ్ అయ్యేది లేదు అన్నట్టు ట్వీట్ చేశాడు. వర్మ వంగవీటి రాధాకృష్ణ, రత్న కుమారిలను కలిసిన టైంలో అక్కడ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, వంగవీటి చిత్రనిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఉన్నారు. చూస్తుంటే వంగవీటి సినిమా వర్మకు పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టేలానే ఉంది. మరి వర్మ వెనుకడుగు వేస్తాడా లేక అటో ఇటో తేల్చుకుంటాడా అన్నది వేచి చూడాల్సిందే.