స్వాగ్ దర్శకుడి చేతిలో సిద్ధూ జొన్నలగడ్డ?

యువ నటుడు సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం స్వరూప్ రాజ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఇది చేస్తుండగానే సిద్ధూ మరో సినిమాని లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. రాజరాజ చోళ, స్వాగ్ వంటి విభిన్నమైన కధాంశాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు హసిత్ గోలి సిద్ధూ కోసం ఓ కధ సిద్ధం చేసి వినిపించగా, సిద్ధూ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు సాగితే ఈ సినిమాని దిల్ రాజు తన సొంత బ్యానర్‌పై నిర్మించే అవకాశం ఉంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.