సరస్వతిగా వస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్‌

ప్రముఖ కోలీవుడ్‌ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌ తెలుగు ప్రేక్షకులు సుపరిచితురాలే. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్, క్రాక్, నాంది వంటి పలు సినిమాలలో నటించి మెప్పించిన ఆమె ఇప్పుడు దర్శకురాలుగా మారి ‘సరస్వతి’ టైటిల్‌తో ఓ సినిమా సిద్ధం చేస్తున్నారు. 

సినిమాలో నటిస్తూ దర్శకత్వం చేయడం ఎంత కష్టమో తెలియజేస్తూ సరదాగా సాగే ఓ వీడియో విడుదల చేశారు. స్వీయ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాని దోస డైరీస్ బ్యానర్‌పై పూజా శరత్ కుమార్‌, వరలక్ష్మి శరత్ కుమార్‌ నిర్మిస్తున్నారు. అంటే ఈ సినిమా పూర్తి బాధ్యతలు ఆమే మోస్తున్నారన్న మాట!