బ్రహ్మిది ఎంత గొప్ప మనసు..!

నవ్వుల రారాజు బ్రహ్మానందం ఈమధ్య ఫాం కోల్పోయినా సరే ఆయన్ను వాడుకోవడంలో మాత్రం దర్శక నిర్మాతలు సక్సెస్ అవుతున్నారు. రీసెంట్ గా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో బ్రహ్మి పాత్ర ఉండదు కాని హీరో పనిచేస్తున్న ఆఫీస్ లోనే తన పక్కన ఎంప్లాయీ హీరో చేసే ప్రతి పనికి వెటకారంగా బ్రహ్మి ఫోటోతో గ్రూప్ చాట్ చేసే సీన్స్ బాగుంటాయి. బ్రహ్మిని ఇలా వాడుకుంటాం అని తెలియగానే శ్రీనివాస్ రెడ్డి బ్రహ్మానందం కు ఫోన్ చేసి మాట్లాడాడట. తన ఫోటోతో ఇలా చేస్తున్నాం అని చెప్పగానే ఫోటో ఎందుకు చేయమంటే నేనే డైరెక్ట్ గా నటిస్తా అన్నాడట.

అయితే సినిమా షూటింగ్ మొత్తం భీమిలిలో చేయడం వల్ల ఆయన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బ్రహ్మానందం ను వాడుకోలేదని అన్నాడు శ్రీనివాస్ రెడ్డి. తన పాత్రతో కామెడీ చేయించడమే కాదు తన ఫోటోతో కూడా కామెడీతో నచ్చించి మెప్పించాడు బ్రహ్మానందం. అంతేకాదు హీరో పక్క బ్రహ్మి ఇమేజ్ లను యాడ్ చేసి మెసేజ్ చేసే క్యారక్టర్ చేసింది ఆ సినిమా అసిస్టెంట్ డైరక్టర్ అట. సో మొత్తానికి అలా బ్రహ్మి శ్రీనివాస్ రెడ్డి హిట్ లో భాగస్వామ్యం అయ్యాడు. ప్రస్తుతం తన కెరియర్ ఎలా ఉన్నా సాటి కమెడియన్ కు హిట్ రావాలని కోరుకున్న బ్రహ్మానందం మంచి మనసుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.