
నాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం ఇప్పటికే మూడు సినిమాలు అవి కూడా హిట్లు కొట్టేయడంతో నాని రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం చేస్తున్న నేను లోకల్ సినిమా కూడా ఈ నెల 23న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని సినిమాలో నటిస్తున్న మిగతా నటీనటుల వల్ల సినిమా లేట్ అవుతుందట. ఇక సినిమా రిలీజ్ కూడా ఈ నెలలో కష్టమే అంటున్నారు. అయితే ఈ క్రమంలో సంక్రాంతికి నాని సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.
త్రినాధ రావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ లక్కీ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే అసలైతే దిల్ రాజు శర్వానంద్ తో తీస్తున్న శతమానం భవతి సినిమా సంక్రాంతి రిలీజ్ అని ఎనౌన్స్ చేశాడు. ఇప్పుడు నాని సినిమాను పొంగల్ కు దించి శర్వానంద్ ను వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారట. శర్వానంద్ కు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది ఈ ఇయర్ ఇప్పటికే ఎక్స్ ప్రెస్ రాజాగా శర్వానంద్ సూపర్ హిట్ అందుకున్నాడు. శతమానం భవతి కూడా అదే విధంగా సంక్రాంతికి రిలీజ్ అయ్యి సక్సెస్ కొడుతుందని ఊహించారు. నాని సినిమా అనుకున్న టైం కు కంప్లీట్ అవకపోవడంతో నాని సినిమానే సంక్రాంతికి వదిలి శర్వానంద్ సినిమా కాస్త లేట్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నాడట దిల్ రాజు.