ఓటీటీలోకి మన శంకర వరప్రసాద్ గారు వచ్చేస్తున్నారు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేసిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ జనవరి 12న సంక్రాంతి పండుగకి వచ్చారు. చిరంజీవి మార్క్ కామెడీ, ఫైట్స్ డైలాగ్స్, ప్రత్యేక ఆకర్షణగా వెంకటేష్ చిరంజీవిల డాన్సుతో అందరినీ మెప్పించారు. 

ఇప్పుడీ సినిమా ఈ నెల 11 నుంచి జీ5 ఓటీటీలోకి రాబోతోంది. సినిమా థియేటర్లకు వెళ్ళి చూడలేకపోయిన ఓటీటీ ప్రేక్షకులు ఇప్పుడు హాయిగా కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చొనే ‘మన శంకరవరప్రసాద్ గారు’ హడావిడి చూసి ఆనందించవచ్చు. 

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.