నాగార్జున కార్ రేటు తెలుసా...?

దేనిలోనైనా తన స్పెషాలిటీ చూపించే కింగ్ నాగార్జున స్టార్స్ లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తో ఉంటాడు. ఓ పక్క హీరోగా చేస్తూనే బిజినెస్ రంగంలో కూడా మంచి పట్టు సాధించిన నాగార్జున రీసెంట్ గా ఓ లక్సరియస్ కార్ ను కొనుగోలు చేయడం జరిగింది. తన పుట్టినరోజు సందర్భంగా తనకు ఇష్టమైన బి.ఎం.డబల్యు 7 సీరీస్ ఎల్.ఐ.ఎక్స్ డ్రైవ్ స్పోర్ట్స్ కార్ ను కొన్నారట.     

ఇక కార్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ రిజిస్ట్రేషన్ RTO కు వచ్చారు. నిభంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని నాగ్ అక్కడి నుండి వెళ్లారు. కార్ నెంబర్ టి.ఎస్ 09 ఈక్యూ 9669 కేటాయించారు. మరి ఈ నెంబర్ ఎంతపెట్టి కొన్నారో తెలియలేదు. ఇక నాగ్ కొన్న కార్ వాల్యూ కోటి 87 లక్షల దాకా ఉండొచ్చని తెలుస్తుంది. దేశంలో ఏ కొత్త లక్సరియస్ కార్ రిలీజ్ అయిన సరే దాన్ని ముందు తన సొంతం చేసుకునే అభిరుచి కలిగిన నాగార్జున ఈ సరికొత్త కార్ తో మరోసారి తన స్టైల్ ను చూపించగలిగాడు.   

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఓం నమో వెంకటేశాయ సినిమాలో నటిస్త్తున్న నాగార్జున ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయట.