సంబంధిత వార్తలు

నటుడు నాగబాబు కుమార్తె నీహారిక సినీ నటిగా ప్రయత్నించి కుదరకపోవడంతో నిర్మాతగా మారి సొంత బ్యానర్ నిహారిక కొణిదెల ప్రొడక్షన్స్‌లో సినిమాలు తీస్తున్నారు. తాజాగా యువనటుడు సంతోష్ శోభన్ హీరోగా ఆమె #పీఈప్2 అనే సినిమా తీయబోతున్నట్లు నేడు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం చేయబోతున్నారు. నిహారిక కొణిదెల ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, పింక్ ఎలిఫాంట్ కలిసి ఈ సినిమా తీయబోతున్నాయి.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మానస శర్మ, సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: ఎదురోల్లు రాజు, ఎడిటింగ్: అన్వర్ అలీ చేస్తున్నారు. త్వరలోనే సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలు వెలువడే అవకాశం ఉంది.