మహిళా కమీషన్‌కి అదే చెప్పా: శివాజీ

సినీ తారల డ్రెస్సింగ్ గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. సినీ పరిశ్రమకు చెందిన అనసూయ, నాగబాబు, ప్రకాష్ రాజ్ వంటివారు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టారు.

ఈ వ్యవహారంపై తెలంగాణ మహిళా కమీషన్ శివాజీకి నోటీస్ పంపడంతో నేడు విచారణకు హాజరయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “మహిళల వస్త్ర ధారణ గురించి మాట్లాడుతున్నప్పుడు పొరపాటున రెండు అన్-పార్లమెంటరీ పదాలు పలికాను. వాటిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు నేను వారందరికీ పదేపదే క్షమాపణలు చెప్పుకున్నాను.

అలాంటి పదాలు వాడటం తప్పేనని మహిళా కమీషన్ ఎదుట కూడా ఒప్పుకున్నాను. కానీ నేను మంచి ఉద్దేశ్యంతోనే మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడాను తప్ప వేరే దురుదేశ్యం లేదని కమీషన్‌కి చెప్పాను.

మహిళా కమీషన్ చైర్ పర్సన్ గారు ఏమన్నారంటే ప్రజలను బాగా ప్రబావితం చేయగల సినీ పరిశ్రమలో ఉన్న మీరు మహిళల గురించి తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని చూసి రేపు మరొకరు అలాగే మాట్లాడకుండా ఉంటారా? అని ప్రశ్నించారు.

ఆమె చెప్పిన పాయింట్ కరక్టే. కనుక ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పాను. నా సమాధానంతో మేడంగారు సంతృప్తి చెందారనే భావిస్తున్నాను,” అని శివాజీ చెప్పారు.

నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవ్వటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు

ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను

- నటుడు శివాజీ https://t.co/SXfwRy0gdC pic.twitter.com/5TaLR12xKt
— ChotaNews App (@ChotaNewsApp) December 27, 2025