సంబంధిత వార్తలు

యువ హీరో రోషన్ కనకాల, సాక్షి మధోల్కర్ జంటగా చేసిన ‘మోగ్లీ 2025’ ఈనెల 13న థియేటర్లలో విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో నెలరోజులు పూర్తికాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొత్త సంవత్సం మొదటి రోజునే అంటే జనవరి 1వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
సందీప్ రాజ్ కధ, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంగీతం: కాల భైరవ్, కెమెరా: ఎం రామమూర్తి, ఎడిటింగ్: పవన్ కళ్యాణ్, ఆర్ట్: కిరణ్ మామిడి, యాక్షన్: నారాజ్ మడిగొండ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 42గా టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ఈ సినిమానిర్మించారు.