
మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి నేడు ‘రాజుగారి పెళ్ళిరో’ పాట విడుదలైంది. చంద్రబోస్ వ్రాసిన ఈ పాటకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ కలిసి చాలా హుషారుగా పాడారు. ఈ పాట లిరిక్స్, సంగీతం, దానికి నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి చేసిన డాన్స్ అన్నీ చక్కగా కుదిరాయి. కనుక మూడో పాట కోసం తప్పకుండా ఎదురుచూడవచ్చు.
ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన అనగనగా ఒక రాజు వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/QvzBNBvFNhY?si=iLvLh_PK9iKIhHqA" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>