
మారుతి-ప్రభాస్ కాంబినేషన్లో జనవరి 9న వస్తున్న రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై సస్పెన్స్‌కి తెర దించింది శ్రేయాస్ మీడియా. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోనే అట్టహాసంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగబోతోందని సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇక వేదిక ఎక్కడనేది మాత్రమే తెలియాల్సి ఉంది. ఎక్కువ సమయం లేదు కనుక మరికొద్ది సేపటిలో అదీ తెలియజేస్తారు.
ఒకరోజు ముందే రాజాసాబ్ ప్రీమియర్స్ ఉంటాయని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఇదివరకే చెప్పారు. కనుక జనవరి 8కి రాజసాబ్ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.