
నందమూరి బాలకృష్ణ-బోయపాటి సినిమా అఖండ-2 భారీ అంచనాల మద్య నేడు ప్రపంచవ్యాప్తం విడుదలయ్యింది. ఇది మాస్ కమర్షియల్ సినిమా కావడంతో ఊహించినట్లే కొన్ని నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ ఇది బాలయ్య సినిమా కనుక మొదటి రోజు కలెక్షన్లలో దూసుకుపోయింది. కానీ అఖండ-2 నిర్మాతలలో ఒకరైన రామ్ ఆచంట సినిమా సక్సస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
“అఖండ-2 ప్రేక్షకులలకు నచ్చింది. సినిమా బాగుందని చెపుతున్నారు. కానీ సినీ పరిశ్రమలోనే కొందరు నెగెటివ్‌గా మాట్లాడుతుండటం చాలా బాధ కలిగిస్తోంది. కానీ చాలా వేగంగా సినిమా బుకింగ్స్ జరుగుతున్నాయి. కనుక రివ్యూలని పట్టించుకోనవసరం లేదు. ఎవరి అభిప్రాయం వారు చెపుతారు అంతే!
సినిమా రిలీజ్ విషయంలో సమస్య ఏర్పడటం ఓవర్సీస్ థియేటర్స్ కొన్ని చేజారిపోయాయి. ఆ కారణంగా బుకింగ్స్ పై కొంత ప్రభావం పడింది. కానీ అఖండ-2 విజయవంతం అవడంతో దీని కోసం రేయింబవళ్ళు కష్టపడిన మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము,” అని అన్నారు.