వెంకీ-త్రివిక్రమ్ సినిమా టైటిల్‌: ఆదర్శ కుటుంబం

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌  కాంబినేషన్‌లో మొదలుపెట్టిన సినిమాకి ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47-ఏకే 47’ అని ఖరారు చేశారు. టైటిల్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. అంతేకాదు... నేటి నుంచే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించబోతున్నారు.     

గతంలో వెంకటేష్‌ నటించిన సూపర్ హిట్ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్,’ ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటల రచయితగా చేశారు. ఇద్దరికీ కామెడీ మీద మంచి పట్టుంది. కనుక వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు టైటిల్‌ పోస్టర్లో ప్రకటించారు.