
బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో డిసెంబర్ 5న విడుదల కావాల్సిన అఖండ-2 చివరి నిమిషంలో రద్దు అయిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ సంస్థ, ఇరోస్ కంపెనీ మద్య సోమవారం రాత్రి రాజీ కుదిరినట్లు తెలుస్తోంది.
ఇరోస్ కంపెనీకి చెల్లించాల్సిన మొత్తం బకాయి ఒకేసారి చెల్లించేందుకు టాలీవుడ్ పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కనుక ఆ ఒప్పందం విషయం నేడు మద్రాస్ హైకోర్టుకి తెలియజేసి సినిమా రిలీజ్ నిలిపివేయాలని కోరుతూ వేసిన కేసు ఉపసంహరించుకుంటారు.
తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 11న అఖండ-2 ప్రీమియర్స్, 12న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. నేడు కోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత సినిమా విడుదలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బోయపాటి శ్రీను, సంగీతం: థమన్, కెమెరా: సి. రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకె, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై తేజస్విని నందమూరి, రామ్ ఆచంట, గోపీ అచంటలతో కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో అఖండ-2 నిర్మించారు.