కార్తి అన్నగారు వస్తారు... ట్రైలర్‌

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ నటుడు కార్తి ‘అన్నగారు వస్తారు’ అంటూ ఈ నెల 12న వస్తున్నారు.

నలన్ కుమార స్వామి దర్శకత్వంలో కార్తి, కృతి శెట్టి జంటగా చేసిన ఈ సినిమా టీజర్‌ ఇటీవల విడుదలైంది. సినిమాపై అంచనాలు పెంచింది.

నేడు ట్రైలర్‌ విడుదలైంది. ఇదెలా ఉందో ఓ సారి చూసేస్తే అన్నగారు వస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. తెలుగు సినిమాలకు ఇంగ్లీషు పేర్లు పెడుతున్న ఈ రోజుల్లో ఓ తమిళ సినిమాకి ఆచ్చమైన ఇలాంటి తెలుగు పేరు పెట్టడం బాగానే ఉంది. కానీ ట్రైలర్‌ చూస్తే తమిళ వాసనలు ఘాటుగా తగులుతాయి.  

ఈ సినిమాలో సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్, శిల్ప మంజునాథ్, కరుణాకరన్, తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నలన్ కుమార స్వామి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జార్జ్ సి విలియమ్స్, ఎడిటింగ్: వేట్రె కృష్ణన్, కోరియోగ్రఫీ: శాండీ, షరీఫ్, స్టంట్స్: అనల్‌ ఆరసు చేశారు.

స్టూడియో గ్రీన్ కేఈ బ్యానర్‌పై జ్ఞానవేల్ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మింస్తున్నారు.