
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు...’ సినిమా ఇటీవల విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట వైరల్ అయ్యింది. త్వరలోనే రెండో పాట విడుదల చేయబోతున్నామని అనిల్ రావిపూడి చెప్పారు. చెప్పినట్లుగానే ఈ నెల 6న శశిరేఖ లిరికల్ వీడియో సాంగ్ ప్రమో విడుదల చేయబోతున్నారు. షిప్ యార్డ్ వద్ద చిరంజీవి, నయనతార డాన్స్ చేస్తున్న ఫోటో చాలా ఆకర్షనీయంగా ఉంది.
ఈ సినిమా కోసం వెంకటేష్, చిరంజీవి కలిసి హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఓ క్లబ్బులో ఫెస్టివల్ సాంగ్ చేశారు. ఆ పాట షూటింగ్ నిన్ననే పూర్తయింది. కనుక మీసాల పిల్ల, శశిరేఖ తర్వాత విడుదలయ్యే మూడో పాట అదే కావచ్చు.
ఈ సినిమాలో హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2026, జనవరి 14న సంక్రాంతి పండుగకి విడుదల కాబోతోంది.