రాజాసాబ్ రన్ టైమ్‌ మూడుంపావు గంటలా!

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ‘రాజాసాబ్’ జనవరి 9న సంక్రాంతి పండగకు ముందు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

అమెరికాలో ఇప్పటికే రాజసాబ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయాయి. టికెట్స్ బుకింగ్ వెబ్‌సైట్‌లో రాజాసాబ్ రన్ టైమ్‌ 3 గంటల 14 నిమిషాలని స్పష్టంగా పేర్కొన్నారు. కనుక రాజసాబ్ నిడివి కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు.

కానీ ఇది ప్రభాస్‌-మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కనుక మూడుంపావు గంటలు అలరించగలరనే ఆశించవచ్చు. సినిమా రెండున్నర గంటలైన మూడుంపావు గంటలైన టికెట్ ధర ఒకటే. కనుక ఫ్రీగా ప్రభాస్‌ సినిమా మరో ముప్పావు గంట చూసే అవకాశం లభించిందని అభిమానులు సంతోషించకుండా ఉండరు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్‌ (రాజసాబ్)కు చనిపోయిన తాత ఆత్మగా నటించారు. 

రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.