మోగ్లీ 2025 ట్రైలర్‌... సూపర్ హిట్ పక్కా?

తెలుగు ప్రేక్షకులను అలరించిన రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’తో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ చూసినవారికి ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం కలుగుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ కూడా అదే అభిప్రాయం కలిగిస్తోంది.    

ఈ సినిమాలో రోషన్ కనకాలకు జోడీగా సాక్షి మధోల్కర్ నటించింది. బండి సంజయ్‌ సరోజ్ కుమార్‌, హర్ష చెముడు ముఖ్యపాత్రలు చేశారు. 

ఇదొక రొమాంటిక్ యాక్షన్ సినిమా. కానీ ఈ ప్రేమకధ అడవి నేపధ్యంలో సాగుతుంది కనుక దీనికి మోగ్లీ 2025 అని పేరు పెట్టారు. 

ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ కధ, దర్శకత్వం చేశారు. ఈ సినిమాకు సంగీతం: కాల భైరవ, కెమెరా: ఎం రామమూర్తి, ఎడిటింగ్: పవన్ కళ్యాణ్‌, ఆర్ట్: కిరణ్ మామిడి, యాక్షన్: నారాజ్ మడిగొండ చేశారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 42గా నిర్మిస్తున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల నిర్మాతలు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/gd3xol_YZyU?si=AhoAXHKfYgopDMug" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>