
చాలా కాలం ప్రేమపక్షుల్లా విహరించిన సమంత-రాజ్ నిడిమోరు నిన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సోమవారం ఉదయం తమిళనాడులోని కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్‌లో ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వారి వివాహం జరిగింది.
వారిద్దరికీ ఇది రెండో వివాహమే. సమంత-నాగ చైతన్య ప్రేమించి 2017లో పెళ్ళి చేసుకున్నారు. మూడేళ్ళు కాపురం చేసిన తర్వాత పరస్పర అంగీకారంతో 2021లో విడిపోయారు.
రాజ్ నిడిమోరు 2015లో శ్యామలి డేను వివాహం చేసుకున్నారు. కానీ మనస్పర్ధలు రావడంతో 2022లో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత డికె రాజ్ నిడిమోరు దర్శకత్వంలో సమంత ఫ్యామిలీ మ్యాన్-2, సిటాడెల్: హన్నీ బన్నీ చేసినప్పుడు వారి మద్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.
ప్రస్తుతం సమంత తన సొంత బ్యానర్‌పై నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమా చేస్తున్నారు.