కార్తి అన్నగారు వస్తారు... టీజర్‌

తమిళ నటుడు కార్తి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. కార్తి ఇప్పుడు ‘అన్నగారు వస్తారు’ అంటూ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నలన్ కుమార స్వామి దర్శకత్వంలో కార్తి, కృతి శెట్టి జంటగా చేసిన ఈ సినిమా టీజర్‌ నిన్న విడుదలైంది.

ఈ సినిమాలో సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్, శిల్ప మంజునాథ్, కరుణాకరన్, తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: నలన్ కుమార స్వామి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జార్జ్ సి విలియమ్స్, ఎడిటింగ్: వేట్రె కృష్ణన్, కోరియోగ్రఫీ: శాండీ, షరీఫ్, స్టంట్స్: అనల్‌ ఆరసు చేశారు.

స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మింస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.