
మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా నుంచి మొదటి పాట భీమవరం బల్మా లిరికల్ వీడియో సాంగ్ గురువారం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విడుదల చేశారు. స్థానిక ఎస్.ఆర్.కె కాలేజీలో జరిగిన ఈ పాట లాంచింగ్ ఈవెంట్లో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కలిసి వేదికపై ఈ పాటకి డాన్స్ చేసి విద్యార్ధులకు కిర్రెకించారు.
చంద్రబోస్ వ్రాసిన ఈ పాటని మిక్కీ జే మేయర్ స్వరపరిచి సంగీతం అందించగా నవీన్ పోలిశెట్టి వెంకటేష్ పార్వతితో కలిసి హుషారుగా పాడారు.
సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జే మేయర్; కెమెరా: జే.యువరాజ్ చేస్తున్నారు. అనగనగా ఒక రాజు వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కాబోతోంది.